విశాఖపట్నం, జనవరి 16: ఈనెల 20న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ను ముట్టడించనున్నామని సమైక్యాంధ్ర రాజకీయ ఐకాస రాష్ట్ర సమన్వయకర్త జేటీ రామారావు అన్నారు. బుధవారం ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలోని గురజాడ విగ్రహం వద్ద తెలంగాణభవన్ ముట్టడి గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ
తెలంగాణ నాయకులు కేసీఆర్, కోదండరామ్‌లు బెదిరింపులకు, బ్లాక్‌మెయిలింగ్‌లకు పాల్పడుతూ, సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నారన్నారు. దోపిడీకి పాల్పడుతున్న కేసీఆర్, కవిత, హరీష్‌రావు, కోదండరామ్‌లు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. హైదరాబాద్‌లోని రెండెకరాల తెలంగాణ భవన్లో వ్యాపారాలు జరుగుతున్నాయని, దానిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సమైక్యంగానే రాష్ట్రం ఉంచేలా అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావడానికి సీమాంధ్ర, రాయలసీమ మంత్రులు ప్రయత్నాలు ముమ్మరం చేశారన్నారు. తెలంగాణ భవన్ ముట్టడిని విజయవంతం చేయడానికి సమైక్యవాదులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఐకాస నాయకులు కె.ఆర్.మూర్తి, ఆర్.శ్రీనివాస్,ఎ.మహేష్, గోవింద్, వై.నిర్మలారామ్ తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి