విశాఖపట్నం, చైతన్యవారధి: విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డు వాక్ ఈ నెల 6న నిర్వహిస్తున్నట్లు విశాఖ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.సురేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 6 గంటలకు ఎంవిపి కాలనీలోని పద్మావతి గ్రౌండ్ నుంచి వాక్ మొదలై 10.30 గంటలకు భీమిలి పార్కులో ముగుస్తుందని పేర్కొన్నారు.
పిల్లలకు, స్త్రీలకు, వృద్ధులకు 10 కిలోమీటర్ల వద్ద, మిగిలిన వారికి భీమిలి పార్కు వద్ద వాక్ ముగిస్తుందని తెలిపారు. తిరుగు ప్రయాణానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 15 ఏళ్ల పైబడిన వారు మాత్రమే ఈ వాక్కు అర్హులని వెల్లడించారు. ఆసక్తి గల వారు 6వ తేదీ ఉదయం 5 గంటల నుంచి తమ పేర్లను నమోదు చేసుకొని చెష్టు నెంబర్లు పొందాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9866705139, 9391286644, 8143151836 నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి