ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు
చోడవరం, జనవరి ౨౦: నియోజకవర్గ కేంద్రం చోడవరంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు గానూ అంతా రాజకీయాలకతీతంగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఆర్క్ మానవరుల కేంద్రంలో ఫోరమ్ ఫర్ బెటర్ చోడవరం ఆధ్వర్యంలో చారి అధ్యక్షతన
అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రాజు మాట్లాడుతూ డివిజన్ ఏర్పాటుకు చోడవరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నా రాజకీయ ప్రాబల్యంతో వేరే చోట ఏర్పాటుకు చర్యలు చేపట్టడం శోచనీయమన్నారు. ఇందుకు గాను హైకోర్టులో వాజ్యం వేసేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. అఖిల పక్ష నాయకులను తీసుకుని ముఖ్యమంత్రి వద్దకు వెళ్లాలని సీపీఐ కార్యదర్శి రెడ్డి అప్పలరాజు సూచించారు. కార్యక్రమంలో దేవరపల్లి సన్యాసిరావు, అల్లు తాతంనాయుడు, చందు రాంబాబు, డా.నీలం శారద, ఆర్క్ ప్రసాదు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి