హైదరాబాద్: ఉప్పల్ సమీపంలోని హేమానగర్ ప్రధాన రహదారిపై ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలో బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నగదు చోరీకి విఫలయత్నం చేశారు. అందులో నుంచి డబ్బులు రాకపోవడంతో ఆగ్రహంతో ఏటీఎంను ధ్వంసం చేసి వెళ్లిపోయారు. సమాచారమందుకున్న మేడిపల్లి పోలీసులు సంఘటనా స్థలాన్ని
పరిశీలించి కేసు నమోదు చేశారు. ఏటీఎం సెంటర్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలను పట్టుకోవడం కష్టంగా మారిందని పోలీసులు తెలిపారు.
పరిశీలించి కేసు నమోదు చేశారు. ఏటీఎం సెంటర్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలను పట్టుకోవడం కష్టంగా మారిందని పోలీసులు తెలిపారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి