అచ్యుతాపురం, జనవరి ౧౬: ప్రభుత్వ భూముల్లో ఉండే చెరువులను, కాలవను వాటి పూర్వపు స్థితిని మార్చకుండా చూడాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సెజ్‌లో కలిసిపోయిన ప్రభుత్వ భూములను పరిశీలించడానికి పూడిమడక, చిప్పాడ, జంగుళూరు, మడుతూరు,
దుప్పితూరు, భోగాపురం, దిబ్బపాలెం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామాల పరిధిలోని 2900 ఎకరాల ప్రభుత్వభూమిని ఎపీఐఐసీ అధికార పూర్వకంగా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే సెజ్ గ్రామాల్లో పర్యటించినట్లు చెప్పారు. గతంలో ఉన్న చెరువులను ఎట్టి పరిస్థితులలోనూ తొలగించకుండా ఉండే నిబంధన ప్రకారం భూములు అప్పగిస్తున్నామన్నారు. మధ్యాహ్నం వరకు భూములను పరిశీలించిన ఆయన తరువాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వసంతరాయుడు, ఎపీఐఐసీ జెడ్ఎం యతిరాజు, తహసీల్దార్ సీతారామారావు, ఎంపీడీవో మంజులావాణి, బార్‌కు అధికారులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి