-అమృతహస్తం ప్రారంభోత్సవంలో మంత్రి బాలరాజు
చింతపల్లి, చైతన్యవారధి: గర్భిణులకు ఇకపై పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టిందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి పసుపులేటి బాలరాజు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిర అమృత హస్తం కార్యక్రమాన్ని ఆయన జిల్లా కలెక్టర్ శేషాద్రితో కలసి గురువారం చింతపల్లి మండలం తాజంగిలో
ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉప్మా మాత్రమే అందించేవారని తెలిపారు. ప్రస్తుతం మధ్యాహ్న భోజనం అందించేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. పౌష్టికాహారం లోపం కారణంగా గర్భిణులు,బాలింతలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారని పేర్కొన్నారు. కాన్పు జరిగిన తరవాత మాతా, శిశు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయని వెల్లడించారు. ఇకపై అలాంటి పరిస్థితి తలెత్తకుండా పౌష్టికాహారం అందించేందుకు ఇందిర అమృతహస్తం కార్యక్రమం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం అమలులో ఎక్కడా రాజీ పడవద్దని ఐసీడీఎస్ అధికారులకు సూచించారు. అనంతరం లబ్ధిదారులతో కలసి భోజనం చేశారు. తరవాత తాజంగిలో రూ. 60 లక్షలతో మరమ్మతులు చేపట్టిన రిజర్వాయరును పరిశీలించారు. ఎనిమిది పంచాయతీలకు ప్రధాన కేంద్రంగా ఉన్న తాజంగిలో గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకు, వినతులు స్వీకరించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్కు మంత్రి బాలరాజు సూచించారు. అనంతరం చెరకుంపాకలు చౌడుపల్లి రహదారిని పరిశీలించారు. ఈ రహదారి నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు లేవని స్పష్టం కావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాలలో నిర్మించే రహదారుల కోసం అటవీ, ఆర్అండ్బీ శాఖలు సమన్వయంతో పని చెయ్యాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకొవాలని పేర్కొన్నారు. ఈనెల 6న చింతపల్లి మండలంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి పర్యటనను విజయంవంతం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, పాడేరు ఆర్డీఓ గణపతిరావు, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.అనసూయ, జిల్లా ప్రాజెక్ట్ అధికారి చిన్నయ్యమ్మ, చింతపల్లి సీడీపీఓ శ్రీకళ, చింతపల్లి ఎంపీడీఓ భాగ్యారావు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి