విశాఖపట్నం, జనవరి ౧౬: విశాఖ జిల్లాలో సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న 18 సంస్థల ప్రతినిధులతో 'విశాఖ కో-ఆర్డినేషన్ ఫోరమ్' ఏర్పడింది. బుధవారం సర్క్యూట్‌హౌస్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన సమావేశానికి 18 సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను తెలిపారు. సమైక్యాంధ్ర పొలిటికల్
జెఎసి రాష్ట్ర కన్వీనర్ జెటి రామారావు మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేసిన విధంగా సమైక్యాంధ్ర ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమించే సంస్థలతో ఏర్పాటు చేయనున్న ఐక్యవేదికలో న్యాయవాదులు ఉండేలా చూడాలన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతూనే ఉత్తరాంధ్ర అభివృద్ధిపై కూడా ఐక్యవేదిక పోరాటం చేస్తే మంచిదని సూచించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ, తనకు తెలిసిన మేరకు రాష్ట్రం విడిపోదన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ, సమైక్యాంధ్ర కోసం ఏస్థాయి పోరాటం జరిగినా తన మద్దతు ఉంటుందన్నారు. ఎయు ప్రొఫెసర్ సూరప్పడు, సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి రాష్ట్ర కన్వీనర్ ఆడారి కిశోర్‌కుమార్, సమైక్యాంధ్ర యువజన జెఎసి కన్వీనర్ ఎం.కృష్ణారావు, స్టూడెంట్ జెఎసి నేత ఆరేటి మహేష్, మహిళా జెఎసి నేత వై.నిర్మలారామ్ తదితరులు మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎవరికివారు ఉద్యమం చేసేకన్నా, ఐక్యంగా ఉద్యమిస్తే ఫలితం ఉంటుందని తెలిపారు. అన్ని జెఎసిల ప్రతినిధులు 'విశాఖ కో-ఆర్డినేషన్ ఫోరమ్'లో సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ నెల 17న హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం ఉంటుందని, దీనికి తాను కూడా హాజరవుతానని తెలిపారు. అక్కడి నుంచి తిరిగివచ్చాక వేలాది మంది విద్యార్థులతో సభను ఏర్పాటు చేసి, కో-ఆర్డినేషన్ ఫోరమ్ పనిచేసే విధానంపై చర్చిద్దామని తెలిపారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి