విశాఖపట్నం, జనవరి 20: మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ ఆదివారం నగరంలో సందడి చేశారు. ఈ సందర్భంగా వీమాక్స్ థియేటర్ ప్రాంగణంలో కొంత సేపు అభిమానులతో ముచ్చటించాడు. రామ్‌చరణ్‌తో కలసి చిత్ర దర్శకుడు వి.వి.వినాయక్, చోటా.కె. నాయుడు, డి.వి.వి. దానయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ
చిత్రాన్ని ఆదరిస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నాయక్ అభిమానుల మన్ననలు పొందేలా వీవీ వినాయక్ చాలా బాగా చిత్రీకరించారని అన్నారు. మున్ముందు మంచి సినిమాల్లో నటిస్తానని అభిమానులతో అన్నారు. నాయక్ విజయం సాధించిన సందర్భంగా కేక్‌ను కట్ చేశారు. అభిమానులతో ఆ ప్రాంతం రద్దీగా మారింది. రామ్‌చరణ్‌తో కరచాలనం చేసేందుకు ఒక్కసారిగా అందరూ వేదిక పైకి ఎగబడ్డారు. అభిమానులను కట్టడి చేయడానికి పోలీసులు ఇబ్బంది పడ్డారు. అనంతరం వీమాక్స్ థియేటర్లో ఉదయం ఆట చూస్తున్న అభిమానులను పలకరించాడు. కార్యక్రమంలో వి.వి. వినాయక్, విజయ్, వాసు, క్రాంతి ఫిలిమ్స్ అధినేత ఎన్.ఆర్.కె. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రహదారి భద్రతతోనే ప్రమాదాల నివారణ.. రహదారి భద్రత సూత్రాలు పాటించడంతోనే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని సినీనటుడు రామ్‌చరణ్‌తేజ్ పేర్కొన్నారు. నాయక్ చిత్రం విజయోత్సవ కార్యక్రమానికి ఆదివారం ఉదయం నగరానికి వచ్చిన ఆయన మహిళ కళాశాల వద్ద సీటి ట్రాఫిక్పోలీసులు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వాహనదారులకు, అభిమానులకు రోడ్డు భద్రతపై పలు సూచనలుచేశారు. వాహనాలు నడిపే వారు రోడ్డు భద్రతపై పూర్తిస్థాయిలోఅవగాహన పెంచుకుంటే ప్రమాదాల నివారణకు అస్కారం ఉంటుందన్నారు. విశాఖనగరంలో గత మూడేళ్లగా రోడ్డు ప్రమాదాలసంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా సీటీ ట్రాఫిక్ పోలీసులపై ప్రశంసల జల్లు కురిపించారు. దర్శకులు వీవీ వినాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సురక్షితంగా ప్రమాణం చేసి క్షేమంగా ఇంటికి వెళ్లాలన్నారు. నగర పోలీసు కమిషనర్ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల సహకారంతోనే ప్రమాదాల నివారణ సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. వాహనదారులు కనీస భద్రత పాటించాలని హితవుపలికారు. వారం రోజుల పాటు నిర్వహిస్తున్న రహదారి భద్రత వారోత్సవాలను అందరూ ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. డీసీపీ విశ్వప్రసాదు, ట్రాఫిక్ ఏడీసీపీ సురేష్‌బాబు, అచ్యుతరావు, తూర్పు మండలం సీఐ రాజేశ్వరరావు, టుటౌన్ ఎస్సై సింహాచలం, కేఎస్ఎన్ కొండ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి