విశాఖపట్నం, చైతన్యవారధి: కొత్త సంవత్సర వేడుకలు మంగళవారం నగరంలో ఘనంగా జరుపుకున్నారు. ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసి పలువురు అభినందనలు తెలిపారు. కలెక్టర్ వి.శేషాద్రి, పోలీసు కమిషనర్ శివధర్‌రెడ్డి, ఎస్పీ శ్రీనివాస్, జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ, వుడా వి.సి. కోనశశిధర్,
జె.సి.ప్రవీణకుమార్, పోర్టు ఛైర్మన్ అజేయకల్లాం ఇళ్ల వద్ద కోలాహలం కనిపించింది. పలువురు ఉదయం నుంచి కలిసి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, ద్రోణంరాజు శ్రీనివాస్ ఇళ్ల వద్ద తాకిడి కనిపించింది. ఎమ్మెల్యేలు అధికారులను కలిసి అభినందనలు తెలిపారు. మంత్రులు బాలరాజు, గంటాశ్రీనివాసరావులను పలువురు కలిసి అభినందనలు తెలిపారు.
దేవాలయాల్లో సందడి: కొత్త సంవత్సరం నేపధ్యంలో నగరంలో ప్రధాన ఆలయాల వద్ద భక్తుల తాకిడికి పెరిగింది. కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కొంతమంది క్యూలు కట్టి మరీ దర్శించుకున్నారు. సంపత్ వినాయగర్ ఆలయం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. ఇతర ఆలయాల్లోను తాకిడి అధికంగానే ఉంది.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి