- సిఎం, కేంద్ర మంత్రి
విశాఖపట్నం, చైతన్యవారధి: నక్కపల్లి మండలంలోని హెటిరో ఔషద పరిశ్రమలో శనివారం సాయంత్రం రియాక్టర్ పేలడం వల్ల సంభవించిన అగ్నిప్రమాదంలో గాయపడి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ పరామర్శించారు.
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో ఓ కార్యక్రమానికి హాజర య్యేందుకు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న వీరు అక్కడ నుంచి నేరుగా కేర్ ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయాలపాలైన తాతారావు, వెంకటరావులకు ఎటువంటి ప్రాణాపాయం లేకుండా మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే మరొక అత్యాధునిక సౌకర్యాలు ఉన్న ఆసుపత్రికి తరలించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వపరంగా తగిన సహాయ సహకారాలు అందించేందుకు తగు చర్యలు తీసుకుంటామని, ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నిబ్బరంగా ఉండాలని వారిని ఓదార్చారు. అనంతరం తనను కలిసిన విలేఖరులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పరిశ్రమల్లో ఆధునిక భద్రతా ప్రమాలు అమల్లోకి వచ్చినప్పటికీ ఇటువంటి ప్రమాదాలు సంభవించడం దురదృష్ట కరమన్నారు. జిల్లాలోనున్న పలు పరిశ్రమల్లో అమలు చేస్తున్న భద్రతా ప్రమాణాలపై విచారణ జరిపి, భద్రతా ప్రమాణాల అమలులో ఏ మాత్రం అలక్ష్యం గుర్తించినా సరే తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించామన్నారు. ఈ దుర్ఘటనపై వెంటనే విచారణ జరిపి నివేదికను సమర్పించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామని, నివేదిక అందిన వెంటనే బాధితులకు న్యాయం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటా మన్నారు. రాష్ట్ర మంత్రులు పసుపులేటి బాలరాజు, గంటా శ్రీనివాసరావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, శాసన మండలి సభ్యులు డివి సూర్యనారాయణరాజు, గాదె శ్రీనివాసుల నాయుడు, శాసన సభ్యులు తైనాల విజయకుమార్, మళ్లా విజయప్రసాద్, బోళెం ముత్యాలపాప, చింతలపూడి వెంకట రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, యువి రమణమూర్తిరాజు, కెఎస్ఎన్ఎస్ రాజు, జిల్లా కలెక్టర్ వి శేషాద్రి, పోలీస్ కమిషనర్ శివధర్‌రెడ్డి, కెజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్‌బాబు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి