- ఆర్టీవో జి.వివేకనందరెడ్డి
విశాఖపట్నం, చైతన్యవారధి: మానవ తప్పిదాలతోనే 90 శాతం ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా నిబంధనలు పాటించాలని ఆర్టీవో జి.వివేకనందరెడ్డి సూచించారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా గురువారం రవాణా కార్యాలయంలో వివిధ వాహనాల డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై
అవగాహన కల్పించారు. భారీ వాహనాలు నడిపే ముందు సాంకేతిక లోపాలను గుర్తించాలని, బ్రేకులు, గేరు పార్టులను సరిచూసుకోవాలన్నారు. మద్యం, మత్తు పానీయాలు సేవించి డ్రైవింగ్ చేయకూడదని పేర్కొన్నారు. నిబంధనలు పాటించకపోవటంతో ఏటా 14 లక్షల మంది చనిపోతున్నారని, 80 లక్షల మంది క్షతగాత్రులవుతున్నారని ఆయన గుర్తుచేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పరిస్థితితీవ్రతను బట్టి వారి లైసెన్సులు కూడా రద్దుచేస్తామన్నారు. అనంతరం వాహనం నడిపేటప్పుడు పాటించాల్సిన నియమ నిబంధనలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డ్రైవర్లకు అవగాహన కల్పించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న 150 మంది డ్రైవర్లకు రవాణాశాఖ ముద్రతో ఉన్న ధ్రువపత్రాలను అందజేశారు.
ప్రమాద బాధితులకు సాయమందించాలి..
రోడ్డు ప్రమాదాల్లో బాధిత వ్యక్తులకు మానవతా దృక్పథంతో తక్షణమే సహాయం అందిస్తే, వారి ప్రాణాలు కాపాడిని వారిమవుతామని 'ది ఎబిలిటీ ఫీపుల్స్' స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు దిలిప్ కుమార్ పాత్రో అన్నారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం సంభవించినప్పుడు తక్షణ సహాయం అందకపోవటంతోనే తాను వికలాంగుడిగా మారానని, తనలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ సంస్థను స్థాపించటం జరిగిందన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి సహాయం అందించి, కృత్రిమ అవయవాలు, వైద్య సదుపాయాలను కల్పించడం తమ సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. నగరంలో 123 ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించామని, ప్రమాదం జరిగిన వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1800-425- 8911 కు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీవో మురళీధర్, వెహికల్ ఇన్స్‌స్పెక్టర్లు ఆర్.సీహెచ్. శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి