Loading...

21, జనవరి 2013, సోమవారం

లలితాదేవి ఆలయంలో చోరీ

5 కిలోల వెండి, తులం బంగారం అపహరణ
విశాఖపట్నం, జనవరి ౨౦: కిర్లంపూడి లే అవుట్‌లోని లలితాదేవి ఆలయంలో చోరీ జరిగింది. ఐదు కిలోల వెండి, తులం బంగారం, హుండీలో నగదును దొంగలు అపహరించారు. అమ్మవారి దర్శనానికి ఆదివారం ఉదయం వెళ్లిన భక్తులు చోరీ విషయం గమనించి మూడో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సి.ఐ. లక్ష్మణమూర్తి, ఎస్సై
ఎన్‌.శ్రీనివాసరావు, ఎ.ఎస్‌.ఐ. యూనస్‌, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్‌ టీమ్‌ను వేలి ముద్రలను సేకరించింది. అమ్మవారి విగ్రహం వెనుకవైపు అలంకరణకు ఉంచిన సుమారు 5 కిలోల వెండి వస్తువులు, తులం బంగారంతో పాటు హుండీ పగలగొట్టి అందులోని మొత్తం పోయినట్లు గుర్తించారు. మాజీ మేయరు డి.వి.సుబ్బారావు కూడా సంఘటన స్థలానికి వచ్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాత నేరగాళ్లే ఈ చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి