Loading...

9, ఫిబ్రవరి 2013, శనివారం

పార్లమెంటు దాడి కేసులో అఫ్జల్‌గురుకు ఉరి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 : పార్లమెంటుపై దాడి కేసులో ప్రధాన నిందితుడైన అఫ్జల్‌గురును శనివారం ఉదయం 8 గంటలకు తీహార్ జైల్‌లో అధికారులు ఉరితీశారు. ఈ కేసులో అఫ్జల్‌గురు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరస్కరించారు. దాంతో అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు చేశారు.

2001 డిసెంబర్ 13 న ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించగా మరి కొందరు గాయపడ్డారు. ఈ దాడిలో అఫ్జల్‌గురు ప్రధాన సూత్రధారి. 2001 డిసెంబర్ 15న అఫ్జల్‌గురును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అఫ్జల్‌గురుకు 2004లో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. 2006లో అఫ్జల్‌గురు క్షమాభిక్ష పిటిషన్‌ను పెట్టుకోవడంతో ఉరిశిక్ష నిలిచిపోయింది. గత నెలలోనే అఫ్జల్‌గురు ఉరిశిక్ష అమలుకు కేంద్ర హోం శాఖ సిఫారసు చేసింది. ఉరి శిక్ష అమలును అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు. శనివారం ఉదయం ఉరిశిక్ష అమలు నేపథ్యంలో శుక్రవారం రాత్రే అఫ్జల్‌గురును తీహార్ జైలుకు తీసుకువచ్చారు.

అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జమ్మూ కాశ్మీర్ అంతటా కర్ఫ్యూ విధించారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కూడా హై అలర్ట్ విధించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి