బెంగళూరు : అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం తమిళనాడుకు కర్ణాటక నుంచి కావేరి నదీ జలాల విడుదల ఆరంభమైంది. ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ స్వయంగా ఈ విషయాన్ని శనివారం బీజాపురలో వెల్లడించారు. 'సుప్రీం కోర్టు ఉత్తర్వును గౌరవించటం మా కర్తవ్యం. మనమే నీటి కొరతను ఎదిరిస్తున్నందున ఆ ఉత్తర్వు నుంచి ఊరట
కలిగించాలని న్యాయస్థానాన్ని సోమవారం కోరతామని' పేర్కొన్నారు. తమిళనాడుకు 2.44 టిఎంసీల నీరు విడుదల చేయాలని న్యాయస్థానం గురువారం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించటం తెలిసిందే. మండ్య జిల్లాలోని కృష్ణరాజసాగర జలాశయం నుంచి నీరు విడుదల చేస్తున్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి