Loading...

9, ఫిబ్రవరి 2013, శనివారం

పట్టభద్రులు ప్రలోభాలకు లొంగవద్దు: నాగేశ్వర్‌

రాజమండ్రి: పట్టభద్రులు ప్రలోభాలకు లొంగవద్దని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ అన్నారు. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి కచ్చా జార్జ్‌ విక్టర్‌కు మద్దతుగా ఇవాళ జిల్లాలో పర్యటించారు. రాజమండ్రిలో నాగేశ్వర్‌ మీడియాతో మాట్లాడుతూ... ప్రజాపోరాటాలను ఉద్యమాలుగా మలిచి సమస్యలను పరిష్కరించిన ఘనత
పి.డి.ఎఫ్‌దే నన్నారు. ప్రభుత్వం శాసనమండలి సభ్యులందరికీ రూ.కోటి ఖరీదైన ప్లాట్లను నజరానాగా ఇచ్చినప్పటికీ తాము ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదనే ఉద్దేశంతో ప్లాట్లను తిరస్కరించామన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లు, పోస్టల్‌, ప్రైవేటు కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు కాంట్రాక్టు ఉపాధ్యాయులకు కనీస వేతనాన్ని మంజూరు చేసేందుకు శాసనమండలిలో తాము విశేషంగా కృషిచేశామన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి