గుంటూరు, ఏప్రిల్ 25: రాష్ట్ర వ్యాప్తంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహించే పీసెట్ -2013 ప్రవేశ పరీక్షలు మే 2వ తేదీ నుంచి జరుగనున్నాయి. పీసెట్ ఛైర్మన్, వీసీ కె.వియన్నారావు పరీక్షల షెడ్యూలును గురువారం వర్శిటీలోని తన చాంబర్లో విడుదల చేశారు. 50 రోజుల పాటు వర్శిటీ క్రీడా ప్రాంగణంలో పరీక్షలకు
సంబంధించిన శారీరక దేహదారుఢ్య పరీ క్షలు నిర్వహిస్తారు. మొదటి 42 రోజులు పురుషులకు, జూన్ 13 నుంచి మహిళలకు నిర్వహిస్తారు. రోజుకి 750 మంది చొప్పున 36,952 మంది అభ్యర్ధులకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ర్యాం కులు నిర్ణయిస్తారు. రాష్ట్ర ప్రభు త్వ ఆదేశానుసారం ఇప్పటికి 8 సార్లు పీసెట్ ప్రవేశ పరీక్షలను విజయ వంతంగా నిర్వహించామని, ఈ దఫా కూడా సమర్థవంతంగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేశామని వీసీ కె.వియన్నారావు ఆశాభావం వ్యక్తం చేశారు. బీపీఈడీ కోర్సులో మొత్తం 5,775 మంది దరఖాస్తు చేయగా అందులో 4888 మంది పురుష, 887 మహిళా అభ్యర్ధులు ఉన్నారని పీసెంట్ కన్వీనర్ పి.పి.ఎస్. పాల్కుమార్ తెలిపారు. యూజీడి, పీఈడీ కోర్సులో 5517 మంది దరఖాస్తు చేయగా అందులో 4624 మంది పురుషులు, 891 మంది మహిళా అభ్యర్ధులు ఉన్నారని ఆయన తెలిపారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి