న్యూఢిల్లీ, ఏప్రిల్ ౨౫: జూన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమవుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి కె.జానారెడ్డి చెప్పారు. జూన్ మొదటి లేదా రెండో వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయన్నారు. ఆ తర్వాత పదిహేను రోజులకు మండల, జిల్లాపరిషత్ ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించారు.
ఆయన గురువారం ఏపీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను వారంరోజుల్లోపు పూర్తిచేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందిస్తామన్నారు. ఆ తర్వాత ఎన్నికల తేదీలపై అదే నిర్ణయం తీసుకుంటుందని జానారెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీచేసిన నాటినుంచి తాము ఓటర్ల జాబితా సవరణ, రిజర్వేషన్ల నిర్ధారణ కార్యక్రమాన్ని మొదలుపెట్టామన్నారు. వారంరోజుల్లోపు ఇది పూర్తవుతుందని వివరించారు. ఇప్పటికే ఎన్నికలు ఆలస్యమయ్యాయనీ..., దీనివల్ల అభివృద్ధి నిధులు కూడా ఆగిపోయాయన్నారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల నిర్వహణను వాయిదా వేయబోమని స్పష్టం చేశారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి