హైదరాబాద్, ఏప్రిల్25: గాలి జనార్దనరెడ్డికి మరో ఎదురుదెబ్బ.. వై.ఎస్. హయాంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం ఆయన సన్నిహితుడైన 'గాలి'కి చెందిన సంస్థ బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కి కట్టబెట్టిన భూములను వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జమ్మలమడుగు మండలం వేమగుంటపల్లి, కొత్తగుంటపల్లి, పి.బొమ్మేపల్లి, తూగుట్టపల్లి గ్రామాల్లో బ్రహ్మణికి కేటాయించిన 10,760 ఎకరాల భూములను స్వాధీనం
చేసుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదించారు. దీనికి సంబంధించిన దస్త్రంపై ఆయన గురువారం సంతకం చేశారు. గడువులోపు ఒప్పందాన్ని అమలు చేయలేకపోవడం, అందులోని షరతుల మేరకు ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పడంతో విఫలమైనందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్రహ్మణితో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని, రాయితీలు, ప్రోత్సాహకాలను, నీటి కేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు భూములను వెనక్కి తీసుకునే ప్రక్రియను చేపట్టింది. గాలి జనార్దనరెడ్డి బ్రహ్మణి ఇండస్ట్రీస్ పేరిట కడప జిల్లాలో కోటి టన్నుల సామర్థ్యంగల ఉక్కు పరిశ్రమ కర్మాగారం నెలకొల్పడానికి 2007 మే 1న దరఖాస్తు చేసుకున్నారు. పది వేలమందికి ప్రత్యక్షంగా, లక్షమందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తానని అందులో పేర్కొన్నారు. అప్పటి సీఎం వై.ఎస్. అధ్యక్షతన గల పెట్టుబడుల ప్రోత్సాహక మండలి మే 21న దానిని ఆమోదించి, మెగా పరిశ్రమగా భూమి, రాయితీలు ఇచ్చేందుకు అనుమతించింది. అదేరోజు సచివాలయంలో వై.ఎస్. సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు. జూన్ 6న మంత్రిమండలి దీనికి ఆమోదం తెలిపింది. ఎకరాకు రూ.18 వేల ధరతో జమ్మలమడుగు మండలంలో 10,760 ఎకరాల భూములను కేటాయిస్తూ జూన్ 8న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ తర్వాత నాలుగు రోజులకు.. అంటే జూన్ 10న కడప జిల్లాలో ఈ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదికాక 2008 మార్చి 25న జమ్మలమడుగులో వాణిజ్య విమానాశ్రయం ఏర్పాటు కోసం ఎకరాకు 25 వేల ధరతో 3.115.64 ఎకరాల భూమిని కేటాయిస్తూ మరో ఉత్తర్వును జారీ చేసింది. ఒప్పందం ప్రకారం 2009 డిసెంబరు నాటికే ఉక్కు కర్మాగారం 2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో మొదటి దశ పూర్తి కావాలి. దానికి ఇచ్చిన గడువు 2010 మే 20తోనే ముగిసినా పనుల్లో పురోగతి కనిపించలేదు. బ్రహ్మణి సంస్థ 10,760 ఎకరాలను తాకట్టు పెట్టి పొద్దుటూరులోని యాక్సిస్ బ్యాంకులో రూ. 350 కోట్ల రుణం తీసుకున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. పరిశ్రమల శాఖ క్షేత్రస్థాయి పరిశీలన జరిపి బ్రహ్మణి కర్మాగారాన్ని చేపట్టే పరిస్థితి లేనందువల్ల ఒప్పందం రద్దుకు సిఫార్సు చేసింది. దీంతో ప్రభుత్వం గత ఏడాది మే 31న ఒప్పందం రద్దుకు ఉత్తర్వులు జారీ చేసింది.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి