Loading...

1, అక్టోబర్ 2013, మంగళవారం

కలెక్షన్ల సునామీ సుష్టిస్తున్న 'అత్తారింటికి దారేది'


సినిమావారధి: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి బాక్సాఫీసు వద్ద తన సత్తాఎంటో చాటుతున్నాడు. గతంలో గబ్బర్‌సింగ్‌తో రికార్డులను తిరగరాసిన పవన్ ఇప్పుడు తాజాగా వచ్చిన అత్తారింటికి దారేదితో మరిన్ని రికార్డులు కొల్లగొట్టనున్నాడు. ఈ నేపధ్యంలో పవన్‌ 'అత్తారింటికి దారేది' రూ.70కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఈ సినిమా ఒక్క రిలీజ్‌రోజే దాదాపు రూ.15 కోట్లు వసూళ్లతో రికార్డ్‌ సృష్టించింది. మూడు రోజుల్లో రూ.40కోట్లు అర్జించినా పవన్‌ కల్యాణ్‌ రూ.70కోట్ల క్లబ్‌లో చేరడం కష్టమేమీ కాదని ట్రేడ్‌ పండితులు విశ్లేషిస్తున్నారు.
పవర్ స్టార్ అభిమానులతో పాటు, యూత్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈచిత్రం అలరిస్తోంది. సినిమా బిజినెస్ పూర్తయ్యే వరకు ఈ సినిమా తెలుగు సినీచరిత్రలో కలెక్షన్ల పరంగా ఓ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా రికార్డు సృష్టిస్తుందని అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్‘అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్: రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి