చైతన్యవారధి: పవన్‌కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు పని గట్టుకుని ఎవరో లీక్ చేసారు. మీడియాకి ఎవరినుంచో అతని కొత్త పెళ్లికి సంబంధించిన సర్టిఫికెట్ లీక్ అయింది. దాంతో పవన్ కళ్యాణం గురించి మీడియా అంతా రెచ్చిపోయింది. ఎవరికి వారు పవన్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయిందని, పవనిజం బదనాం అయిపోయిందని రాసేస్తున్నారు. పర్సనల్‌గా పవన్‌కి ఈమధ్య కాలంలో బిగ్గెస్ట్ డ్యామేజ్ ఇది. దీనికంటే ముందు అతని సినిమాని కిల్ చేసే ప్రయత్నం జరిగింది. అత్తారింటికి దారేది సినిమా విడుదల కాకముందే పైరసీ చేసి లీక్ చేసేశారు. అయినా కానీ ఆ సినిమా తట్టుకుని నిలబడిందనుకోండి. కానీ దాని వెనుక 'పెద్దల' కుట్ర ఉందని పవన్ స్వయంగా పేర్కొన్నాడు. అప్పుడు పవన్ సినిమాని, ఇప్పుడు పవన్ ఇమేజ్‌ని దెబ్బ తీయడానికి వెనుక నుంచి ఎవరో తమవంతు పాత్ర పోషించారనేది సుస్పష్టం. పవన్‌కళ్యాణ్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది? ఎవరు అతనిపై కక్ష కట్టి మరీ ఇదంతా చేస్తున్నారు? పవన్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడని గత కొంత కాలంగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. గత మే, జూన్ నుంచి పవన్ రాజకీయాలకి సంబంధించి పలువురితో చర్చలు, సంప్రదింపులు జరిపాడు. సరిగ్గా అప్పట్నుంచే అతనిపై ఈ ఎటాక్ స్టార్ట్ అయింది. కొంచెం లోతుగా పరిశీలిస్తే ఈ లీక్ వ్యవహారాలన్నిట్లోను పెద్ద కుట్రే ఉందనే సంగతి అర్థమవుతోంది. తాజాగా జరిగిన ఢీల్లీ ఎన్నికల్లో అమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడం ఆ పార్టీకి ఎ.పీ.లో పవన్ నాయకత్వం వహించనున్నారన్న ప్రచారం జరిగింది. పవన్ కు ఆంధ్రాలో ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి. ప్రజారాజ్యం పార్టీలో ఆయన కనపర్చిన దూకుడు చూసిన కొంత మంది పార్టీల పెద్దలు ప్రస్తుత తరుణంలో కొత్త పార్టీ పెట్టిన లేదా ఏ పార్టీలో చేరినా దాని ప్రభావం ఉంటూందన్న అంచనాతో తమ తమ మీడియా సంస్ధల ద్వారా పవన్ పై దుష్పచారాన్ని మొదలెట్టారని అంటున్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి