Loading...

3, ఫిబ్రవరి 2015, మంగళవారం

ప్రచార రధాలు ప్రారంభం

విశాఖపట్నం, చైతన్యవారధి: ప్రభుత్వ సంక్షేమ పధకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రధాలను రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావులు మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో ప్రారంభించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రచార రధాలను ఏర్పాటు చేశారు. జిల్లాకు మూడు ప్రచార రధాలను కేటాయించారు.
బుధావారం నుంచి వీటి ద్వారా కళా బృందాలు గ్రామాలు, పట్టణాలలో తిరుగుతూ ప్రచారం నిర్వాహించనున్నాయి. ఒక్కో ప్రచార రధం రోజుకు రెండు గ్రామాల్లో తిరగనుంది. ఒక్కో ప్రచార రధం 40 రోజుల పాటు ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ప్రచారం నిర్వహించనుంది. తొలి విడతలో నర్సీపట్నం, భీమునిపట్నం, అరకు నియోజక వర్గాల పరిధిలో ఈ ప్రచార రధాలు పర్యటించనున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఎన్.యువరాజ్, శాసన సభ్యులు బాండారు సత్యన్నారాయణ మూర్తి, పీలా గోవింద్ సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి