Loading...

3, ఫిబ్రవరి 2015, మంగళవారం

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం

- 240 గ్రామాలలో కళాజాతాలు జిల్లా కలక్టరు ఎం.ఎం. నాయక్‌
విజయనగరం, చైతన్యవారధి: రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయాలని జిల్లా కలక్టర్‌ ఎం .ఎం . నాయక్‌ ఆదేశించారు. ముఖ్యంగా రుణమాఫీ, పింఛన్లు, స్మార్ట్‌ విలేజ్‌, స్ట్మార్ట్‌ వార్డులు, స్వచ్ఛభారత్‌ తదితర పధకాల ప్రాధాన్యత గూర్చి ప్రచారం చేయాలన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రచార రధం, కళాజాత బృందాలతో రూపొందించిన షెడ్యూల్‌ ప్రకారం ప్రచార కార్యక్రమం నిర్వహించి ప్రజలను అవగాహన పర్చాలని జిల్లా
కలక్టరు వివరించగారు. ఈ కార్యక్రమం కొరకు జిల్లాకు ప్రభుత్వం మూడు ప్రచార రధ ములను కేటాయించినందున మంగళవారం ఆర్‌ డిఓ కార్యాలయ ఆవరణలో జిల్లా కలక్టరు ప్రచార రధంనకు జెండా వూపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలక్టరు మాట్లాడుతూ ప్రభుత్వ పధకాలపై అవగాహన కలిగించేందుకు రోజుకు రెండు గ్రామాలు చొప్పున 40 రోజుల పాటు ప్రచార రధం, కళా బృందాలు ద్వారా ప్రదర్శనలు యిచ్చేందుకు ఏర్పాటు చేసామన్నారు. ఈ వాహనం ముందుగా గ్రామానికి చేరుకొని ప్రదర్శన నిర్వహించే సమయాన్ని గ్రామస్ధులకు తెలియజెయాలన్నారు. మధ్యాహ్నం 4 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మొదటి ప్రదర్శన ఒక గ్రామంలో ఉంటుందని, రాత్రి 7 నుండి 9 గంటల వరకు రెండవ ప్రదర్శన మరో గ్రామంలో ఉంటుందని కలక్టరు వివరించారు. ప్రదర్శనలో భాగంగా వీడియో ప్రదర్శన, అనంతరం సంగీత నాటక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. ప్రచార రధంలో పి.ఎ. పరికరాలు, లైటింగ్‌ , జనరేటర్‌ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసామన్నారు. ప్రదర్శన కార్యక్రమాలు జాప్యం చేయకుండా నిర్ణయించిన సమాయానికే నిర్వహించాలన్నారు. గ్రామస్ధులు చేరిన తర్వాతే ప్రదర్శన వేయాలన్నారు. ప్రదర్శన ఎక్కడ, ఎప్పుడు వేస్తున్నదీ ఫోటోలు, ధృవీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. కళా బృందాలకు అందజేసిన స్కిప్టు ప్రకారం ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అసభ్య పదజాలాలను వాడరాదని, ప్రజలను ఆకట్టుకొనే విధంగా ప్రదర్శనలు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్‌ అధికారి జె. వెంకటరావు, వయోజన విద్య ఉప సంచాలకులు అమ్మాజిరావు, జిల్లా పౌరసంబంధాల అధికారి పి. గోవిందరాజులు, ప్రచార రధం సూపర్‌ వైజర్లు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి