Loading...

3, ఫిబ్రవరి 2015, మంగళవారం

గంట్ల శ్రీనుబాబుకు 'సత్య సాహితీ పురస్కారం'

- ప్రముఖుల చేతులు మీదుగా ప్రదానం
విశాఖపట్నం, చైతన్యవారధి: వైజాగ్‌ జర్నలిస్ట్స్‌ ఫోరం(విజెఎఫ్‌) అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబును 'సత్య సాహితీ పురస్కారం'తో ఘనంగా సత్కరించారు.  గెడ్డాపు సత్యం జయంతోత్సవాలు సందర్భంగా సత్య సాహితీ ట్రస్టు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం శ్రీకాకుళం పట్టణంలో గిడుగు రామ్మూర్తి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖుల
చేతులమీదుగా ఈ పురస్కారాన్ని శ్రీనుబాబు అందుకున్నారు. ప్రతి ఏటా విభిన్న రంగాల్లో సేవలందించే ప్రముఖులకు అందజేసే ఈ పురస్కారాన్ని, జర్నలిస్టుల రంగంలో విశిష్ట సేవలందించిన విజెఎఫ్‌ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబుకు ఈ ఏడాది అందజేశారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బద్ధప్రసాద్‌, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తదితరులు చేతులుమీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు జర్నలిస్టుల సంక్షేమానికి చేస్తున్న సేవలను ప్రముఖులు కొనియాడారు. ఎమ్మెల్యేలు కిమిడి కళా వెంకటరావు, గుండ లక్ష్మీదేవి, బొగ్గు రమణమూర్తి, శ్యామ్‌ సుందర్‌ శివాజీ, ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌, ఎమ్మెల్సీ విశ్వప్రసాద్‌, టీడీపీ అధ్యక్షులు చౌదరి బాబ్జి, కేంద్ర సాహితీ అకాడమీ గ్రహీత బేతవోలు రామబ్రహ్మం తదితరులు పాల్గొని ప్రసంగించారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి