-జిల్లా కలక్టరు ఎం .ఎం .నాయక్
విజయనగరం, చైతన్యవారధి: జన్దన్ యోజన పధకం కింద ప్రతి కుటుంబానికి రెండు బ్యాంక్ అకౌంట్లు తెరిపించాలని, గ్రామ సర్పంచ్లు సెక్రటరీలు ద్వారా గ్రామాలలో ఖాతాలు లేని కుటుంబాలను గుర్తించి వారితో రెండు బ్యాంక్ అకౌంట్లు తక్షణమే తెరిపించడానికి
చర్యలు చేపట్టాలని జిల్లా కలక్టరు ఎం .ఎం .నాయక్ తహసీల్ధార్లను, ఎంపిడిఓలను ఆదేశించారు. మంగళవారం ఆర్ డిఓ కార్యాలయం నుండి మండలస్ధాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలక్టరు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సహకరించని బ్యాంకర్ల వివరాలు తెలియజేస్తే తగు చర్యలు తీసుకొనేటట్లు చేస్తామన్నారు. మొదటి దశ రుణమాఫీ కార్యక్రమం కింద లబ్ధిపొందని రైతుల ఫిర్యాదులను పరిష్కరించి అప్లోడ్ చేయాలన్నారు. వేరే మండలానికి చెందిన ఫిర్యాదులను ఆయా మండలాలకు పంపించి పరిష్కరించాలన్నారు. రెండవదశకు అర్హులైన వివరాలను త్వరితంగా అప్లోడ్ చేయాలని కలక్టరు ఆదేశించారు. రైతులకు అందజేస్తున్న ఈ-పాస్ పుస్తకాలు వెయ్యి వరకు పెండింగ్ లో ఉన్నాయని, వీటిని త్వరితంగా అందజేయాలన్నారు. వయోజన విద్యా కేంద్రాలలో చదువుచున్న వయోజనులకు మార్చి 15వ తేదీన పరీక్ష జరగనుందని, ఈ పరీక్షకు అందరూ హాజరయ్యే టట్లుచూడాలన్నారు. పరీక్షా కేంద్రాలు ఏర్పాటు, ఇన్విజిలేటర్ల నియామకం, వసతులు ఏర్పాటు ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. గతసారి హాజరు కానివారు, ఫెయిల్ అయినవారు మాత్రమే సుమారు 50 వేలమంది ఈ పరీక్షకు హాజరు అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షలు సజావుగా, సక్రమంగా జరిగేటట్లు చూడాలన్నారు. సాక్షర భారత్ 5వ ఫేజ్ కింద జనవరి 1వ తేదినుండి తరగతులు ప్రారంభ##మయ్యాయని, వీరికి 6 నెలలు తర్వాత పరీక్ష నిర్వహిస్తారని కలక్టరు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పరిషత్ సిఇఓ జి. రాజకుమారి, ఆర్ డిఓ జె. వెంకటరావు, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఇ గాయత్రిదేవి, డుమా ఎపిడి అప్పలనాయుడు, వయోజన విద్య ఉప సంచాలకులు ఎం . అమ్మాజీరావు, మండలాల నుండి తహసీల్ధార్లు, ఎంపిడిఓలు, మండల స్ధాయి అధికారులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి