Loading...

5, నవంబర్ 2016, శనివారం

డిసెంబర్‌ 23 నుండి క్రెడయ్‌ 'ప్రోపర్టీ ఎక్స్‌పో'


ఫోటో : క్రెడయ్‌ ప్రోపర్టీ ఎక్స్‌పో బ్రోచర్‌ను ఆవిష్కరించిన అజయ్‌ కుమార్‌ పండిట్‌, నారాయణ, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు
విశాఖపట్నం, చైతన్యవారధి:
ఈ ఏడాది డిసెంబర్‌ 23 నుండి 25వ తేదీ వరకు ది కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడయ్‌) విశాఖపట్నం చాప్టర్‌ ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో 'ప్రోపర్టీ ఎక్స్‌పో'ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శనివారం ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రోపర్టీ ఎక్స్‌పో బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డీజీఎం అజయ్‌ కుమార్‌ పండిట్‌ మాట్లాడుతూ 'ప్రోపర్టీ ఎక్స్‌పో' సందర్భంగా ఎస్‌బీఐ విరివిగా రుణాలు మంజూరు చేయనుందని చెప్పారు. జీవితంలో ప్రతీ ఒక్కరి కల గృహమని ఈ నేపథ్యంలో ఇల్లు, ఫ్లాట్ల కొనుగోలు దారులకు
9.5శాతం వడ్డీరేటుపై రుణాలు మంజూరు చేస్తామని చెప్పారు. రుణాల జారీకి సంబంధించి నిబంధనలను సరళతరం చేశామని, నవంబరు 1 నుండి డిసెంబర్‌ 31 వరకు ఎస్‌బీఐ పెద్ద ఎత్తున గృహ రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. బిల్డర్లకు ఎస్‌బీఐ అనుకూలంగా ఉందని తెలియజేశారు. ఈ సమావేశంలో క్రెడయ్‌ విశాఖ చాప్టర్‌ అధ్యక్షులు జి.వి.వి.ఎస్‌.నారాయణ మాట్లాడుతూ మూడురోజుల పాటు నిర్వహించనున్న ప్రోపర్టీ ఎక్స్‌పోలో కనీసం 40 నుండి 50 మంది రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు పాల్గొనేందుకు ముందుకొచ్చాయని చెప్పారు. బిల్డర్లు ఈ ప్రోపర్టీ ఎక్స్‌పో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తారని క్రెడయ్‌ నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పో ఇది మూడవదని అన్నారు. క్రెడయ్‌-వైజాగ్‌కు అనుబంధంగా 600 మంది డెవలపర్స్‌ ఉన్నారని తెలియజేశారు. క్రెడయ్‌ గౌరవ కార్యదర్శి బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రెడయ్‌-వైజాగ్‌ చాప్టర్‌ పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోందని, విద్యార్థులకు నోట్‌ పుస్తకాల పంపిణీ, అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు పదిలక్షల రూపాయలు విలువగల బొలేరో వ్యాన్‌ను విరాళంగా ఇచ్చామని, అదేవిధంగా ఆహార పొట్లాలను కూడా అందజేశామని చెప్పారు. చంద్రంపాలెం, మధురవాడల్లోని జిల్లా పరిషత్‌ హైస్కూళ్ల అభివృద్ధికి సుమారు 30లక్షల రూపాయలు వ్యయపరిచామని చెప్పారు. క్రెడయ్‌ ఉపాధ్యక్షులు పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రోపర్టీ ఎక్స్‌పో ద్వారా ప్రతీఒక్కరి డ్రీమ్‌ హౌస్‌ కల నెరవేర్చనున్నామని వెల్లడించారు. ఈ ఎక్స్‌పో సందర్భంగా ఆకర్షణీయమైన బహుమతులు కూడా అందజేస్తామని వివరించారు. ఈ సమావేశంలో క్రెడయ్‌ కార్యదర్శి కె.ఎస్‌.ఆర్‌.కె. రాజు (సాయి), ఎస్‌బీఐ అధికారులు, క్రెడయ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి