Loading...

31, మార్చి 2017, శుక్రవారం

అప్పన్న ఆదాయం రూ.51 లక్షలు

పెందుర్తి, చైతన్యవారధి:
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీసింహాద్రినాథుని ఆదాయం కానుకల ద్వారా రూ.51,18,376 సమకూరింది. గత 15 రోజుల్లో అప్పన్నకు భక్తులు కుండీల ద్వారా సమర్పించిన కానుకలను దేవస్థాన ఈవో కె రామచంద్రమోహన్‌ పర్యవేక్షణలో గురువారం లెక్కించారు. ఇందులో పాత రూ.1000 నోట్లు 50, రూ.500లవి 234 వచ్చాయి. బంగారు 38 గ్రాములు, వెంటి 3.896 కేజీలు లభించినట్లు దేవస్థాన అధికారులు వెల్లడించారు.
వేలంపాటలో రూ.79 లక్షల ఆదాయం
శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానానికి చెందిన దుకాణాలు, కొబ్బరి ముక్కలు, ఫొటోలు తీయుటకు, ఐస్‌క్రీములు ఒక సంవత్సర కాల పరిధికి అమ్ముటకు నిర్వహించిన సీల్డ్‌ టెండర్‌ బహిరంగ వేలంను గురువారం నిర్వహించారు. దీని ద్వారా రూ.79,66,131ల ఆదాయం సమకూరింది. ఈవో ఆదేశాల మేరకు ఏఈవో దుర్గారావు పర్యవేక్షణలో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఈవో మాట్లాడుతూ ఉన్నతాధికారుల అనుమతితో అధికారిక ఉత్తర్వులు త్వరలో వెల్లడిస్తామన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి