Loading...

31, మార్చి 2017, శుక్రవారం

ఉద్యోగాల్లో మహిళల సంఖ్య పెరగాలి

దిల్లీ: ఉద్యోగాల్లో మహిళల సంఖ్య పెరగాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, సైయెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. గురువారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చాలా సంతోషంగా ఉంది. తెలుగువాడిగా గర్విస్తున్నా. తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్లుగా 14వేల ఉద్యోగాలుకల్పించాం. శేరిలింగంపల్లి మండలంలో 54 పాఠశాలలను దత్తత తీసుకున్నాం. డిజిటల్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ద్వారా 20వేల మంది విద్యార్థులు, 40వేల మంది పౌరులకు కంప్యూటర్‌ విద్య నేర్పించాం. భవిష్యత్తులో స్టార్టప్‌ సంస్థలు చాలా రావాలి. రెండు రాష్ట్రాల్లో టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నారు. భావితరాల వారికి ఉద్యోగాలు పెరగాలంటే మరిన్ని సంస్థలు రావాలి. మా సంస్థల్లో 25శాతం మహిళలకు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నాం’’ అని మోహన్‌రెడ్డి తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి