అనకాపల్లి, చైతన్యవారధి: ఉత్తరాంధ్ర పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయని.. ఈ ప్రాంతీయుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే తాను పాదయాత్ర చేపడుతున్నట్లు వైకాపా జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖకి ప్రత్యేక రైల్వేజోన్ కోరుతూ అనకాపల్లి నుంచి పాదయాత్రను మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ రైల్వేజోన్ కోరుతూ ఎంతో మంది పోరాడిన సంగతి గుర్తుచేశారు. రైల్వేజోన్ లేక నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో విశాఖకి రైల్వేజోన్ కేటాయించాలని స్పష్టంగా
ఉన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా ఎంపీలు ఈ ప్రాంత ప్రయోజనాలపై శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. సి.ఎం చంద్రబాబు తన ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారని ఆరోపించారు. విశాఖకి రైల్వేజోన్ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తానని.. అవసరమైతే తలను రైలుపట్టాల కింద పెట్టయినా రైల్వే జోన్ సాధించి తీరుతానని పేర్కొన్నారు. వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రత్యేక హోదాలాగానే రైల్వేజోన్ హామీనీ గాలికి వదిలేశారన్నారు. రైల్వేజోన్ విజయవాడలో పెడతామంటూ రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రైల్వేజోన్ కోరుతూ గతంలో అమర్నాథ్ దీక్షచేస్తే ప్రభుత్వం ఆయనతో బలవంతంగా దీక్ష విరమింపజేసిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా చంద్రబాబు ఉత్తరాంధ్ర కోసం ఏమి చేశారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. అమర్నాథ్ 200 కిలోమీటర్ల మేర చేపడుతున్న పాదయాత్రకు ఉత్తరాంధ్ర ప్రజలతోపాటు పార్టీలోని అన్ని శ్రేణులు సహకారం అందిస్తాయని వివరించారు. వచ్చే నెల 9న భీమిలి చేరుకున్న అనంతరం పాదయాత్ర ముగుస్తుందని.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగన్మోహనరెడ్డి విచ్చేస్తారని అన్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ 2011 జనాభా లెక్కలు, శ్రీకృష్ణకమిటీ, శివరామకృష్ణ కమిషన్.. ఇలా అందరూ ఉత్తరాంధ్ర బాగా వెనకబడి ఉందని చెప్పినా పాలకుల్లో స్పందన రావడం లేదన్నారు. రూ.లక్షా 18వేల కోట్లు అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర కోసం ఎంత ఖర్చుచేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీపీఎం, సీపీఐ జిల్లా నాయకులు సి.హెచ్ నర్సింగరావు, స్టాలిన్ విచ్చేసి అమర్నాథ్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వైకాపా రాష్ట్ర నాయకులు కొయ్యప్రసాద్‌రెడ్డి అధ్యక్షత వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, తిప్పల గురుమూర్తిరెడ్డి, కర్రి సీతారాం, తైనాల విజయ్‌కుమార్, మళ్ల విజయేంద్రప్రసాద్, గొల్ల బాబూరావు, సెంట్రల్ బ్యాంకు మాజీ ఛైర్మన్ సాగి రామచంద్రరాజు, ఆర్ఈసీఎస్ మాజీ ఛైర్మన్ బొడ్డేడ ప్రసాద్, వైకాపా నాయకులు మందపాటి జానకీరామరాజు, గొర్లి సూరిబాబు, మళ్ల బుల్లిబాబు, జాజుల రమేష్, అదీప్‌రాజు, తిప్పల నాగిరెడ్డితో పాటుగా విశాఖ గ్రామీణ, నగర ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లిలో నెహ్రూచౌక్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర శంకరంపై వంతెన వరకు జరిగింది. అక్కడ మధ్యాహ్న భోజన విరామం అనంతరం తిరిగి యాత్రను కొనసాగించారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి