Loading...

31, మార్చి 2017, శుక్రవారం

ఎన్టీపీసీ మూడో యూనిట్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

పరవాడ, చైతన్యవారధి: సింహాద్రి ఎన్టీపీసీ మూడో యూనిట్‌లో గురువారం ఉదయం 4 గంటల ప్రాంతంలో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 500 మెగావాట్ల సామర్థ్యం గల ఈ యూనిట్‌లోని బాయిలర్‌ ట్యూబులకు లీకులు ఏర్పడడంతో అధికారులు విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. సంస్థ కార్మికులు, ఉద్యోగులు హుటాహుటిన బాయిలర్‌ ట్యూబులకు పడిన లీకులకు మరమ్మతులు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అన్ని మరమ్మతు పనులు సజావుగా పూర్తయితే శుక్రవారం రాత్రి కల్లా ఈ యూనిట్‌లో విద్యుదుత్పత్తిని పునరుద్ధరించే అవకాశం ఉందని సంస్థ అధికారిక వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా మిగతా తొలి, రెండు, నాలుగు యూనిట్లలో విద్యుదుత్పత్తి యథావిధిగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి