Loading...

15, డిసెంబర్ 2017, శుక్రవారం

నోవర్క్ ఆర్గానిక్స్ నుంచి సేంద్రియ ఎరువులు, పశు పోషక ఉత్పత్తులు

విశాఖపట్నం, చైతన్యవా‌రధి: పూణేకు చెందిన నోవర్క్ ఆర్గానిక్స్ సంస్థ సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువులు, పశుపోషక ఉత్పత్తులను మార్కెట్ లోకి విడుదల చేసింది. స్థానిక హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఉత్పత్తుల వివరాలు వివరించారు. నేలలో తేమను నిలిపేందుకు ప్రత్యేక మైన ఒక ఉత్పత్తిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నోవర్క్ సంస్థ జీఎం సుభీర్ రంజన్ దాస్ మాట్లాడుతూ తమ సంస్థ ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు, హాని కరం కాని పశు పోషణ ఉత్పత్తులు ఉపయోగించటం వల్ల మెరుగైన ఫలితాలు సాధించ వచ్చునన్నారు. ఎటువంటి రసాయనాలు లేని సహజ సిద్ధంగా లభించే మొక్కల నుంచి ఈ ఉత్పత్తులు తయారు చేయడం జ‌రిగిందన్నారు. నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ఖర్చుకు అందిస్తున్నామన్నారు.
రీజినల్ సేల్స్ మేనేజర్ ఇందుకూరి రవి మాట్లాడుతూ నోవర్క్ ఉత్పత్తులు హెర్భల్స్ తో తయారు చేయడం తో భూమి మరింత సారవంతమవుతుందన్నారు.  తద్వారా పంట పెరుగు దల ఆశాజనకంగా ఉంటుందన్నారు. ఏపీ ఫ్రాంచేజీ టీవిఎస్ ఎన్ రాజు మాట్లాడుతూ నోవర్క్ ఉత్పత్తులు రాష్ట్రంలోనే పూల రైతుల ఇంట తలుపులు తట్టనున్నాయన్నారు. ఉత్పత్తుల ద్వారా కేవలం వ్యవసాయ, పశుపోషణ ఉత్పత్తులు మార్కెటింగ్ చేయడమే కాక ఉపాధి అవకాశాలు కూడా పెంపొందించవచ్చన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. నోవర్క్ సంస్థ నేషనల్ మీడియా మేనేజర్ ఆశాలత నాయక్ మాట్లాడుతూ ఏపీలో ప్రతి గ్రామానికి తమ ఉత్పత్తులు చేరువ చేయాలన్నదే ముఖ్య లక్ష్య మన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి